Telugu Updates
Logo
Natyam ad

అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు..?

మంచిర్యాల జిల్లా: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 131 వ జయంతి సందర్బంగా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.. ఈ సందర్బంగా రామగిరి శ్రీపతి మాట్లాడుతూ.. అంబేద్కర్ మహానుభావులు కొందరి వాడు కాదని అందరి వాడని భరత్ దేశం లో ఉండే ప్రతి పౌరునికి సమాన హక్కు స్వేచ్చ కల్పించి భారత రాజ్యాంగం అందించిన గొప్ప మేధావి అని ఆయన ఏ కులానికి వ్యతిరేకం కాదని కుల వివక్ష కు మాత్రమే వ్యతిరేకం అని, ఏ మతానికి వ్యతిరేకం కాదని మత ఉన్మాదానికి మాత్రమే వ్యతిరేకం అని కొనియాడారు..

ఆయన మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి అని అప్పుడే దేశాభివృద్ధి కి కొలమానమని, దళితుల బానిసత్వం రూపుమాపడానికి రిజర్వేషన్ అందించిన మహా ఘనుడు ఆయన, ప్రతీ ఒక్కరికి ఒక్కటే ఓటు  అని అందరు సమానమని, ప్రపంచంలో అత్యంత ఎక్కువ విద్య అభ్యసించి ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగం రచించిన ఆ మహా నీయుని జయంతి ని భారతీయులకు  నిజమైన పండగ అని తెలియజేసారు.. ఈ సందర్బంగా సాయంత్రం 300మంది మహిళలతో కోలాటం, అట పాటతో అంబేద్కర్ గారి చిత్ర పటా లతో, డప్పు చప్పుళ్లతో ధూమ్ ధామ్ కార్యక్రమం ఉంటుందని తెలియజేసారు..

ఈ కార్యక్రమంలో రామగిరి శ్రీపతి, కాదశి రవీందర్, అటకపురం రాజలింగు, జుమ్మిడి కుమార్, బోన్సా సామి, పెర్క సత్తన్న, చాపిడి సందీప్, ఎల్కపల్లి పవన్ తదితరులు పాల్గొన్నారు..