Telugu Updates
Logo
Natyam ad

గని ప్రమాదంలో ఇద్దరు కార్మికులకు గాయాలు..?

మంచిర్యాల జిల్లా: సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే న్యూటెక్ గనిలో మంగళవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. 1ఏ సీమ్, 13వ ప్యానెల్ వద్ద డీపిల్లరింగ్ పనులు చేస్తుండగా సైడ్ ఫాల్ శబ్దాలు రావడంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. దీంతో ఎలక్ట్రిషియన్ సురేష్, జనరల్ మజ్జూర్ శ్రీనివాస్ కు గాయాలయ్యాయి. పరుగులు తీస్తున్న క్రమంలో సురేష్ ఎన్డీఎల్ యంత్రాన్ని ఢీకొట్టగా, శ్రీనివాస్ టబ్బులకు తాకి కింద పడ్డారు. వెంటనే గాయపడిన కార్మికులను చికిత్స నిమిత్తం రామకృష్ణాపూర్ లోని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కార్మికులను టీబీజీకెఎస్ కార్పొరేట్ చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్ రెడ్డి, న్యూటెక్ గని సెక్రటరీ జగన్ పరామర్శించారు..