Telugu Updates
Logo
Natyam ad

సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి పట్టాలు పంపిణీ

మంచిర్యాల జిల్లా: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి శుక్రవారం రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి పట్టాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 408 మందికి ఆయన పట్టాలు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ విప్ సుమన్ మాట్లాడుతూ పట్టాల పంపిణీతో రామకృష్ణాపూర్ పట్టణం పూర్వవైభవం సంతరించుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండె విఠల్, జిల్లా కలెక్టర్ భారతీ హోలికెరీ, స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు..