Telugu Updates
Logo
Natyam ad

సింగరేణి ఇళ్ల పట్టాల పంపిణీ ప్రజల చిరకాల వాంఛ

రాష్ట్ర మంత్రివర్యులు గంగుల కమలాకర్

మంచిర్యాల జిల్లా: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధి రామకృష్ణాపూర్ పట్టణంలో సింగరేణి స్థలాల్లో నివసిస్తున్న 500 కుటుంబాలకు శుక్రవారం రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి పట్టాలు మంజూరు చేయడం ద్వారా దశాబ్దాల కల నెరవేర్చారన్నారు. ఈ కార్య క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్, రాజ్యసభ సభ్యులు రవిచంద్ర, ఎమ్మెల్సీ దండే విఠల్, కలెక్టర్ భారతి హోలికెరీ, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, తదితరులు పాల్గొన్నారు..