Telugu Updates
Logo
Natyam ad

శ్వాస అందక 60 గొర్రెలు మృతి..!

ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని భీంసరిలో భీమానవేణి రామన్న అనే రైతుకు చెందిన 60 గొర్రెలు గురువారం గొర్రెల కొట్టంలో శ్వాస అందక మృతిచెందాయి. దాదాపు రూ.6 లక్షల నష్టం జరిగిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేసాడు. పశుసంవర్ధక శాఖ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించగా. బాధిత కుటుంబాన్ని స్థానిక ఎంపీటీసీ బీక్కి గంగాధర్ పరామర్శించారు. ఎమ్మెల్యే జోగు రామన్న సహకారంతో ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు..