Telugu Updates
Logo
Natyam ad

షాకింగ్: 45 తుపాకీలు స్వాధీనం.. దంపతుల అరెస్టు?

దిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రెండు ట్రాలీ బ్యాగుల్లో 45 తుపాకీలను అక్రమంగా తరలిస్తున్న భారతీయ దంపతులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఇవి నిజమైన తుపాకులా, కాదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అలాగే, ఈ కేసులో రంగంలోకి దిగిన ఉగ్రవాద నిరోధక విభాగం నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్ జీ ) ఇవి పూర్తిగా నిజమైన తుపాకులుగానే కనబడుతున్నాయని పేర్కొంది. జులై 10న వియత్నాం నుంచి భారత్ కు తిరిగి వచ్చిన ఈ దంపతులను జగ్జిత్ సింగ్, జశ్విందర్ కౌర్ లుగా అధికారులు గుర్తించారు. తుపాకీలను రెండు ట్రాలీ బ్యాగుల్లో తీసుకొస్తుండగా జగ్జిత్ సింగ్ ను అరెస్టు చేసిన దిల్లీ కస్టమ్స్ అధికారులు.. ఆ తుపాకీలను తన సోదరుడి మంజిత్ సింగ్ నుంచి తీసుకొచ్చినట్టుగా పేర్కొంటున్నారు. ప్యారిస్ నుంచి వియత్నాం వెళ్లిన మంజిత్ సింగ్ అక్కడే జర్జిత్ సింగ్ ను కలిసి ఈ బ్యాగులను అందించినట్టు సమాచారం.

ఈ తుపాకుల విలువ దాదాపు రూ.22,50,000 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, గతంలోనూ టర్కీ నుంచి భారత్ కు 25 తుపాకీలను తీసుకొచ్చినట్టు నిందితులు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో దర్యాప్తును కొనసాగిస్తున్నారు…