మంచిర్యాల జిల్లా షి టీమ్ యస్.ఐ.వి. హైమ
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రామగుండము సిపి శ్రీనివాస్ ఆదేశాల ప్రకారం మంచిర్యాల జిల్లా షి టీమ్ శుక్రవారం మంచిర్యాల జిల్లా లోని దోనబండ నందు గల శ్రీ చైతన్య హై స్కూల్ లో షి టీమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించిండం జరిగింది, ఈ సందర్బంగా షి టీమ్ సిబ్బంది ఎస్.ఐ మాట్లాడుతూ..
జిల్లాలో ఉన్న షీ టీమ్ యొక్క ప్రాముఖ్యత నిర్వహించే విధుల గురించి, మానవ అక్రమ రవాణా, ఫోక్సో చట్టాల గురించి, బాల్య వివాహాలు దాని యొక్క పరిణామాల గురించి, ఈవ్ టిజింగ్, T-SAFE అప్లికేషన్ తదితర అంశాల గురించి, సోషల్ మీడియా యొక్క పరిణామాల గురించి, సైబర్ క్రైమ్స్ మరియు సైబర్ హెల్ప్ లైన్ నంబర్ 1930 గురించి, డయల్ 100 ప్రాముఖ్యత, సమాజ రుగ్మతల గురించి సమాజంలో జరుగుతున్న నేరాలు వాటి నుండి ఎలా రక్షణ పొందాలి ,మహిళల పిల్లల రక్షణకు ఉన్న చట్టాల గురించి, సోషల్ మీడియా వల్ల జరుగు నష్టాలు లాభాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా షీ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది అని మహిళలు,బాలబాలికలు, విద్యార్థిని విద్యార్థులకు రక్షణగా నిలుస్తూ సేవలు అందించడం జరుగుతుందని, తెలంగాణ రాష్ట్రంలో షీ టీమ్స్ ప్రత్యేక గుర్తింపు పొందిందని తెలిపారు. మహిళలు బాలికలు విద్యార్థినిలు షీటీమ్స్ సేవలు వినియోగించుకోవాలని ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని తెలిపారు.
ఎవరైనా వేధించిన, రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేళనగా మాట్లాడిన, ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే 100 లేదా రామగుండం షీ టీమ్ నెంబర్ 6303923700 కు ఫిర్యాదు చేసినచో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే షీ టీమ్ నెంబర్ కు తెలపాలని, షీ టీమ్ పోలీసులు ద్వారా విద్యాసంస్థల వద్ద, రద్దీ ప్రదేశాల్లో సివిల్ డ్రస్ లలో నిత్యం తిరుగుతూ నిఘా ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమం లో మంచిర్యాల జిల్లా షి టీమ్ మహిళా కానిస్టేబుల్ జ్యోతి, శ్రీలత, భరోసా సెంటర్ కో ఆర్డినేటర్ విజయ,సబ్ ఆర్డినెట్ పుష్పాలత, స్కూల్ కరస్పాండెంట్ రవి , ప్రిన్సిపాల్ దేవేందర్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.