Telugu Updates
Logo
Natyam ad

షాద్ నగర్ వద్ద నకిలీ పత్తి విత్తనాల పట్టివేత..

*మొత్తం 633 ప్యాకెట్లు.. 255.64 కేజీల స్వాధీనం*

*ఒక వాహనం తో పాటు.. ఖాళీ ప్యాకెట్లు..మిషనరీ.. కెమికల్ పౌడర్ తదితర సామాగ్రి గుర్తింపు*

*డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శంషాబాద్ జోన్.. షాద్ నగర్ ఏసీపీ పర్యవేక్షణలో ఎస్వోటీ శంషాబాద్.. షాద్ నగర్ పోలీస్ స్ట్రింగ్ ఆపరేషన్ లో పట్టుబడ్డ వైనం*

రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్:  తెలంగాణ ప్రభుత్వము నిషేధింపబడిన పత్తి విత్తనాలను రైతులకు అంటగట్టి వారి చావులకు పరోక్షంగా కారణమవుతున్నా నకిలీ పత్తి విత్తనాల రాకెట్ నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శంషాబాద్ జోన్.. షాద్ నగర్ ఏసీపీ పర్యవేక్షణలో ఎస్వోటీ శంషాబాద్.. షాద్ నగర్ పోలీస్ స్ట్రింగ్ ఆపరేషన్ లో పట్టుబడ్డ వైనంతో ఒక్కసారిగా పెద్ద మొత్తంలో పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. మొత్తం 633 ప్యాకెట్లు.. 255.64 కేజీలను స్వాధీనం చేసుకోవడంతోపాటు
ఒక వాహనం .. ఖాళీ ప్యాకెట్లు..మిషనరీ.. కెమికల్ పౌడర్ తదితర సామాగ్రి గుర్తించారు.ఈ కేసుకు సంబంధించిన వివరాలను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శంషాబాద్ లో నిర్వహించిన సమావేశములో శంషాబాద్ జోన్ డిసిపి.. షాద్ నగర్ ఏసీపీలు వెల్లడించారు.

*వ్యవసాయ అధికారి నిశాంత్ కుమార్ ఫిర్యాదుతో..*

— *రాయికల్ క్రాస్ రోడ్ వద్ద...

ఇది ఈనెల 5వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో ఫరూక్ నగర్ మండల వ్యవసాయ అధికారి నిశాంత్ కుమార్ ఫిర్యాదుతో సమాచారాన్ని అందుకున్న ఎస్ఓటి శంషాబాద్..షాద్ నగర్ పోలీసులు సంయుక్తంగా వాహనాలను తనిఖీ చేస్తుండగా.. అనుమానాస్పదంగా కనిపించిన టాటా ఏసీ ఏపీ 22 టీఏ 3119 నందు గోనె సంచులలో.. ప్యాకెట్ లలో ఉన్న పత్తి విత్తనాలను వ్యవసాయ అధికారి పోలీసులు పరిశీలించారు. ఎలాంటి లాట్ నెంబర్..ఇన్ వాయిస్.. అనుమతులు లేకుండా.. అక్రమ సరఫరా చేస్తున్న నకిలీ పత్తి విత్తనాలు ను పట్టుకున్నారు.మొత్తం 633 ప్యాకెట్లు..255.64 కేజీల స్వాధీనం చేసుకోవడంతోపాటు
ఒక వాహనం తో పాటు.. ఖాళీ ప్యాకెట్లు..మిషనరీ.. కెమికల్ పౌడర్ తదితర సామాగ్రి గుర్తించారు. వీటితో పాటుగా మరిన్ని లూజ్ విత్తనాలను.. ఖాళీ సంచులను స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు ఇతడే..!

అమాయకులైన రైతులకు నకిలీ పత్తి విత్తనాలను అంటగడుతూ..అక్రమ సంపాదనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నారాయణపేట జిల్లా కేంద్రము సత్యసాయి కాలనీ కి చెందిన పోలవరపు హరిబాబు (47) సీడ్ ఆర్గనైజర్ గా పని చేసేవాడు. అయితే ఎంతో కాలంగా నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతూ వ్యాపారానికి పాల్పడ్డాడు. దీంతో వ్యవసాయ అధికారి ఫిర్యాదుతో.. పక్కా సమాచారాన్ని అందుకున్న ఎస్వోటీ శంషాబాద్ పోలీసులు.. షాద్ నగర్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. పోలవరపు హరిబాబు పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. అనంతరం రిమాండ్ కు తరలించారు. సమావేశంలో శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి .. షాద్ నగర్ ఏసిపి కుశల్కర్ .. శంషాబాద్ రూరల్ సీఐ శ్రీధర్ కుమార్.. ఎస్వోటీ పోలీస్ శంషాబాద్, షాద్ నగర్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.