Telugu Updates
Logo
Natyam ad

ఫెర్టిలైజర్, విత్తన దుకాణాల్లో తనిఖీలు..”!

మంచిర్యాల జిల్లా: జిల్లా  కేంద్రంలోని ఫెర్టిలైజర్, విత్తనాలు అమ్మే దుకాణాల్లో మంగళవారం పోలీస్, వ్యవసాయ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లో స్టాక్ వివరాలు, రికార్డు బుక్ లను పరిశీలించారు. రైతులకు నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు అమ్మరాదని, ఎవరైనా అమ్మితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు అమ్మే ప్రతి విత్తనాలు ఎరువుల కు బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలని తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను, ఎరువులను అమ్మి వారి ఉన్నతికి తోడ్పడాలని సూచించారు. నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువుల అమ్మకం, సరఫరా, కొనుగోలు చేసిన సమాచారం తెలిసిన స్థానిక పోలీస్ అధికారులకు లేదా డయల్ 100 కు కాల్ చేసి పోలీసు శాఖకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

ఈ తనిఖీల్లో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, ఏడీఏ శివానంద్, విత్తన ధ్రువీకరణ అధికారి దుర్గేష్, మంచిర్యాల డిఎవో కల్పన, ఎడిఎ అనిత, ఎవో కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. ,