హైదరాబాద్: బంజారాహిల్స్ లోని ఓ వస్త్ర దుకాణంలో దారుణం చోటుచేసుకుంది. వస్త్ర దుకాణంలోని బాత్రూంలో రహస్య కెమెరా పెట్టిన క్లీనింగ్ బాయ్.. కొంత మంది మహిళల రహస్య చిత్రాలు సేకరించాడు. అయితే ఏడాది క్రితం ఈ ఘటన జరగ్గా.. తాజాగా బాధిత వస్త్ర దుకాణంలో పని చేస్తున్న సేల్స్ గర్ల్ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ చిత్రాలను ఇప్పుడు చూపించి వేధిస్తున్నట్లు సేల్స్ గర్ల్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు.. నిందితుడు పశ్చిమ బెంగాల్క చెందిన యువకుడిగా గుర్తించారు. నిందితుడి చరవాణి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.