Telugu Updates
Logo
Natyam ad

సీజనల్ వ్యాధుల పట్ల కళాకారుల అవగాహన

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కాసిపేట ఆరోగ్య కేంద్రం పరిధిలో సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజు ఆదేశానుసారము సోమ గూడెం గ్రామంలో జాతీయ ఆరోగ్య మిషిన్, ఆరోగ్య కార్యక్రమాల పైన కళాకారుల బృందం చే అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆసుపత్రుల్లో ప్రసవాలు సాధారణ ప్రసవాలు చేయాలని వందశాతం టీకాలు ఇప్పించాలని జాతీయ క్షయ కుష్టు నివారణ కార్యక్రమాలు చేపట్టాలని కీటక జనిత వ్యాధులు మలేరియా డెంగ్యూ లాంటివి ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టడం జాగ్రత్తలు తీసుకోవాలని  గ్రామాలలో శుభ్రత పాటించడం గ్రామపంచాయతీ మునిసిపల్ వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో సమన్వయం మరియు ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రుల ద్వారా వైద్య సేవలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వార సేవలు మొదలగునవి అవగాహన కల్పించడం జరిగినదని తెలిపారు.. ఈ కార్యక్రమంలో కాజీపేట వైద్యాధికారి డాక్టర్ కిరణ్, పర్యవేక్షకులు, ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, రమేష్ కళాబృందము, బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి పాల్గొన్నారు.