Telugu Updates
Logo
Natyam ad

స్కూల్ బస్సును డీకొన్న ఐచార్ వ్యాన్..?

నలుగురు విద్యార్థులకు గాయాలు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: జిల్లా కేంద్రంలో సెయింట్ మేరీస్ స్కూల్ బుస్సును ఐచార్ వ్యాన్ వెనుక నుంచి ఢీకొనడంతో నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. అందిన సమాచారం మేరకు సెయింట్ మేరీస్ స్కూల్ బస్సు పిల్లలను దించేందుకు భీంపూర్ వెళ్తున్న క్రమంలో బండార గ్రామ వద్ద అకస్మాత్తుగా ఐచర్ వ్యాన్ వెనుక నుంచి ఢీకొనడంతో 3, 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నలుగురు విద్యార్థులు భీంపూర్ గ్రామానికి చెందినవారు. గాయపడిన విద్యార్థులను వైద్య చికిత్స నిమిత్తం ఆసిఫాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్య చికిత్స నిమిత్తం మంచిర్యాల కు తరలించారు..