Telugu Updates
Logo
Natyam ad

ఎస్సీ వర్గీకరణ బిల్లును.. పార్లమెంటులో ప్రవేశ పెట్టాలి

 బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు “ఎంఆర్​పీఎస్ నేత పెంటనోళ్ల నర్సింహా” వినతి

రంగారెడ్డి జిల్లా:పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధం కల్పించాలని బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు “ఎంఆర్​పీఎస్ నేత పెంటనోళ్ల నర్సింహా” కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం తొమ్మిది రేకుల గ్రామంలో ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా బండి సంజయ్ ను షాద్ నగర్ నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ ఇన్చార్జ్ నరసింహ మాదిగ కలుసుకున్నారు. ఈ సందర్భంగా వినతి పత్రం సమర్పించారు. నర్సింహా మాదిగ మాట్లాడుతూ మాదిగ చిరకాల వాంఛ షెడ్యూల్డు కులాల వర్గీకరణ అని, బీజేపీ ప్రభుత్వం వేస్తే 100 రోజుల్లో చట్ట బద్ధత చేసి మాదిగలకు న్యాయం చేస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వము రాబోయే పార్లమెంటు సమావేశాల్లో వర్గీకరణకు చట్టబద్ధత చేసి మాదిగలకు మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ షాద్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి పెంటనోళ్ల నరసింహ మాదిగ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహా రెడ్డి, బీజేపీ నియోజకవర్గ ఇంచార్జ్ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ కేశంపేట మండల అధ్యక్షుడు గ్యార సురేష్ మాదిగ, కొందుర్గు మండల ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జ్ ఆనంద్, ఎమ్మార్పీఎస్ నాయకులు శ్రీకాంత్, వినోద్, అనంతయ్య, చెన్నకేశవులు, తదితరులు పాల్గొన్నారు..