ఇంటర్ పరీక్షల తేదీలపై విద్యాశాఖ పునరాలోచన!
హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ పరీక్షల తేదీలపై విద్యాశాఖ పునరాలోచన చేస్తోంది. ఇంటర్ పరీక్షల తేదీలపై జేఈఈ మెయిన్ షెడ్యూల్ ప్రభావం పడే అవకాశం ఉన్నందున మరోసారి షెడ్యూల్ మార్చక తప్పనిపరిస్థితి నెలకొందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. పరీక్షల షెడ్యూల్ పై ఇరోజు లేదా రేపు స్పష్టత ఇస్తామని ఆమె తెలిపారు. రాష్ట్రంలో ఏప్రిల్ 22 నుంచి మే 11 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, ఏప్రిల్ 23 నుంచి మే 12 వరకు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని ఇటీవల అధికారులు నిర్ణయించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ 21 నుంచి మే 5 వరకు నిర్వహించాల్సి ఉంది. అయితే, ఏప్రిల్ 21 నుంచి జేఈఈ మెయిన్ పరీక్ష కారణంగా షెడ్యూలులో స్వల్ప మార్పులు చేసినట్టు ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు..