రుణ మాఫీ చేయకుండా రైతులను మోసం చేసిన ప్రభుత్వం..
మంచిర్యాల జిల్లా: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ చేయకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఆరోపించారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల పంటలకు సాగు నీరు అందించకుండా సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్, హైదరాబాద్ ప్రాంతాలకు తరలిస్తున్నారని తెలిపారు. వెంటనే రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు…