Telugu Updates
Logo
Natyam ad

బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు పడ్డాయ్..!

వికారాబాద్ లో ఒకరి అకౌంట్ లో రూ.18.52 కోట్ల జమ

చెన్నైలోని హెచ్ డీ ఎఫ్ సి ప్రధాన కార్యాలయంలో సాంకేతిక సమస్యే కారణం

వికారాబాద్ జిల్లా: రాష్ట్రంలో పలు హెచీ డీ ఎఫ్సీ బ్యాంకు ఖాతాల్లోకి రూ. కోట్లలో సొమ్ము జమైంది. సామాజిక మాధ్యమాల్లో ఈ అంశం వైరల్ గా మారింది. వికారాబాద్ పట్టణానికి చెందిన వెంకట్ రెడ్డి ఖాతాలో రూ.18.52 కోట్లు, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలోని రేవోజిపేట్ గ్రామానికి చెందిన వంగాల సాయి ఖాతాలో రూ.1.27 కోట్లు, పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన ఇల్లెందుల సాయి ఖాతాలో రూ.5.68 కోట్లు జమైనట్లు సెల్ఫోను సంక్షిప్త సందేశాలు రావడంతో వారు విస్మయానికి గురయ్యారు. తన ఖాతాలో నుంచి రూ.50 వేలు ఇతరులకు బదిలీ చేయడానికి వెంకట్ రెడ్డి ప్రయత్నించగా వీలు కాలేదు. సోమవారం తన ఖాతా నుంచి రూ. లక్ష తనదే అయిన మరో ఖాతాకు బదిలీ చేశానని.. వెనువెంటనే రెండు ఖాతాలు పనిచేయకుండా పోయాయని వంగాల సాయి తెలిపారు. రూ.5.68 కోట్ల సొమ్ము సుమారు 5 గంటలపాటు తన ఖాతాలో ఉందని.. ఆ తర్వాత వెనక్కి వెళ్లిందని ఇల్లెందులు సాయి చెప్పారు. చెన్నైలోని హెచ్డీఎఫ్సీ ప్రధాన కార్యాలయంలో కొత్త సాఫ్ట్ వేర్ ను ఇన్స్టాల్ చేసే క్రమంలో ఏర్పడిన సాంకేతిక సమస్యతోనే పలువురి ఖాతాల్లో రూ. కోట్లలో జమైనట్లు తెలిసింది.