రోడ్డు నిర్మాణ పనుల అడ్డగింత..?
మంచిర్యాల జిల్లా తాండూర్: నాలుగు వరుసల రహదారి విస్తరణలో భాగంగా తాండూర్ మండల కేంద్రం ఐబీలో నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న విలేజ్ అండర్ పాస్ (బ్రిడ్జి) నిర్మాణ పనులను మంగళవారం జడ్పీటీసీ సాలిగామ బానయ్య, ఎంపీటీసీ సిరంగి శంకర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పీఏసీఎస్ చైర్మన్ సుబ్బదత్తుమూర్తి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, స్థానిక వ్యాపారులు, ఇండ్ల యజమానులు అడ్డుకున్నారు. విలేజ్ అండర్ పాస్ కాకుండా కాలమ్స్ బ్రిడ్జి లేదా మామూలు రోడ్డు నిర్మించాలని కోరారు.
తాండూర్ సీఐ జగదీశ్ ఆధ్వర్యంలో తాండూరు, మాదారం, భీమిని, కన్నెపల్లి ఎస్ఐలు కిరణ్ కుమార్, సమ్మయ్య, వెంకటేశ్, సురేశ్, మహిళా పోలీసు సిబ్బంది, బెల్లంపల్లి ఏఆర్ పోలీసుల బందోబస్తు మధ్య ఎన్హెచ్ అధికారులు ఈ పనులను ప్రారంభించారు. సమస్యలుంటే లిఖిత పూర్వకంగా నేషనల్ హైవే అథారిటీ కార్యాలయంలో సంప్రదించాలని స్థానికులకు సూచించారు. అయినప్పటికీ పనులు అడ్డుకోవడంతో జడ్పీటీసీ బానయ్య, ఎంపీటీసీ సిరంగి శంకర్, పీఏసీఎస్ చైర్మన్ దత్తుమూర్తి, మరి కొందరినిపోలీస్ స్టేషన్కు తరలించారు. బందోబస్తు మధ్య రోడ్డు పనులను అధికారులు కొనసాగించారు.