Telugu Updates
Logo
Natyam ad

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం..!

మంచిర్యాల జిల్లా: కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్, లారీ ఢీకొన్న ఈ ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే. హాజీపూర్ మండల కేంద్రానికి చెందిన రెబ్బ అంజయ్య అనే యువకుడు తన తండ్రితో కలిసి షెట్ పల్లి గ్రామానికి వెళుతుండగా లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలతో అంజయ్య మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.