Telugu Updates
Logo
Natyam ad

రేవంత్ రెడ్డితో జగ్గారెడ్డి భేటీ..!

తెలంగాణ: తెలంగాణ కాంగ్రెస్ లో ఉప్పూనిప్పుగా ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా నేరుగా పీసీసీ చీఫ్ను లక్ష్యంగా చేసుకుని జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. నేరుగా అధిష్టానికి లేఖ పంపారు. దీంతో సీనియర్లు స్పందించి, రాజీనామాపై వెనక్కి తగ్గేలా చేశారు. ఈ తరుణంలో శుక్రవారం సీఎల్పీ భేటీ సందర్భంగా కీలక సన్నివేశం జరిగింది. రేవంత్ రెడ్డిని జగ్గారెడ్డి ఆప్యాయంగా పలకరించారు. ఆ తరువాత వారిద్దరూ 20 నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రస్తుతం వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం పొందింది. ఎక్కడ ఓటమి ఎదురైనా ఆ రాష్ట్రంలో పార్టీ అంతర్గత కలహాల కారణంగానే అనేది రాజకీయ వర్గాల భావన. ఈ తరుణంలో కలిసికట్టుగా పని చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారని తెలుస్తోంది.