రామగుండం: కమీషనర్ గారి కార్యాలయంలో పోలీస్ శాఖలో గత 34సం,, లుగా హోం గార్డ్ గా విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న బి. సంపత్ రెడ్డి హోంగార్డ్ నంబర్ .243 గోదావరిఖని సబ్ యూనిట్ నందు విధులు నిర్వహించడం జరిగింది. ఇతనిని రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ (ఐజీ) గారు పూలమాల వేసి, శాలువా తో సత్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో ఏఆర్ ఏసీపీ సుందర్ రావు, ఆర్ఐ మధుకర్, శ్రీధర్,హోంగార్డ్స్ ఇంచార్జ్ ఆర్ఐ విష్ణు ప్రసాద్,హెడ్ కాన్స్టేబుల్ తిరుపతి ,పిసి రవిందర్, హోం గార్డ్స్ ప్లాటూన్ కమాండర్, సారయ్య, శ్రీనివాస్ ఉన్నారు.