Telugu Updates
Logo
Natyam ad

అక్రిడిటేషన్‌ కార్డుల గడువును పునరుద్ధరించుకోండి..?

జిల్లా పౌరసంబంధాల అధికారి సంపత్ కుమార్..

మంచిర్యాల జిల్లా: ప్రభుత్వం జర్నలిస్టుల కు అక్రిడిటేషన్ కార్డుల. గడువు పొడిగించిందని జిల్లా పౌరసంబంధాల అధికారి సంపత్ కుమార్ వెల్లడించారు. మరో మూడు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని స్పష్టం చేశారు. గడువు జూన్ 30 వరకు ఉన్నందున దానికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. అక్రిడిటేషన్ కార్డులపై ఇందుకు సంబంధించిన స్టిక్కర్లను వేస్తామన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. మార్చి 31 నుండి కార్యాలయంలో ఈ స్టికర్లు వేస్తామని మీడియా మిత్రులు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని కోరారు.