ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి
ఆదిలాబాద్ జిల్లా: మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వాట్సాప్ లో స్టేటస్ పెట్టిన ఆదిలాబాద్ పట్టణానికి చెందిన డోంగ్రే పింటు అనే వ్యక్తిని ఆదివారం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో అరెస్టు చేసి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కు పంపడం జరిగిందని జిల్లా ఎస్పి ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఎవరైనా ఇలాంటి మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టు పెట్టినట్లైతే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి పోస్టులను ప్రజలు నమ్మకూడదని, సంయమనం పాటించాలని పోలీసు వ్యవస్థ దోషులను అరెస్టు చేసి కేసులు నమోదు చేస్తుందని తెలిపారు. ఇలాంటి మత విద్వేషాలను ఎవరైనా సరే రెచ్చగొట్టే ప్రయత్నం చేసినచో వెంటనే చట్టం, పోలీసులు తగు చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రజలు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా చేసే పుకార్లను విశ్వసించ కూడదని ఎలాంటి సందేహాలకు అయినా జిల్లాలోని పోలీసు అధికారులను సంప్రదించవచ్చని సూచించారు..