Telugu Updates
Logo
Natyam ad

మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై నిఘా..!

డిసీపీ అఖిల్ మహాజన్

మంచిర్యాల జిల్లా: లో మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులపై నిఘా పెట్టినట్లు ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ తెలిపారు. అన్ని వర్గాల వారు పోలీసులతో సహకరించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు వీడియో క్లిప్పింగ్స్, గుర్తులను అప్లోడ్ చేసి ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా పోస్టులు పెడుతున్నారన్నారు. సోషల్ మీడియాపై, మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులపై, వారి కదలికలపై నిఘా పెట్టడం జరిగిందని తెలిపారు. చట్టవ్యతిరేక, ప్రజా శాంతికి భంగం కలిగించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు..