Telugu Updates
Logo
Natyam ad

రెడ్ క్రాస్ సొసైటీ ప్రాజెక్టులకు సహాయ సహకారాలు అందించాలి

మంచిర్యాల జిల్లా: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్టు డైరెక్టర్ రవీందర్ రావు, అదానీ ఫౌండేషన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సత్యనాథన్ ను మంగళవారం మంచిర్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, ప్యాట్రన్ సభ్యులు, బ్లడ్ బ్యాంక్ ఇంచార్జ్ మధుసూదన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అదానీ ఫౌండేషన్ చైర్మన్ గౌతం ఆదానీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడు ప్రాజెక్టులకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ మేరకు బ్లడ్ బ్యాంకుకు అవసరమైన ముఖ్యమైన కొన్ని పరికరాలను సమకూర్చాలని వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంసిసి డిజిఎం అనిల్ కుమార్ పాల్గొన్నారు..