Telugu Updates
Logo
Natyam ad

పోలీస్ స్టేషన్లలో రిసెప్షనిస్ట్ పాత్ర కీలకమైనది – జిల్లా ఎస్పి

ఆదిలాబాద్ జిల్లా: ప్రతి పోలీస్ స్టేషన్ లో రిసెప్షనిస్ట్ పాత్ర కీలకమైనది ని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. మొదటగా పోలీస్ స్టేషన్ లో పెండింగ్లో ఉన్న కేసుల స్థితిగతులను, వివరాలను తెలుసుకొని వాటిని సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. కేసుల దర్యాప్తు నందు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదు దారి పట్ల గౌరవంగా వ్యవహరించాలని, ప్రతి ఫిర్యాదును ఎప్పటికప్పుడు రిజిస్టర్ లో పొందుపరచాలని, వాటికి సంబంధించిన ఎంక్వైరీ రిపోర్ట్ను సంబంధిత దరఖాస్తుకు జతపరచాలి అని తెలిపారు. తదుపరి పోలీస్టేషన్లో ఉన్న సిబ్బంది నిర్వహించే విధులను అడిగి తెలుసుకున్నారు. తమకు సంబంధించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించి పోలీస్ స్టేషన్ కు సంబంధించిన ప్రతి ఒక్క రికార్డును ఎప్పటికప్పుడు నవీకరిస్తు ఉండాలని సూచించారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది ప్రతి ఒక్కరూ సక్రమంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. లేనియెడల వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అంతమొందించాలని దానికి ప్రతి ఒక్కరు కఠోర శ్రమ చేయాలి అని సూచించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ డీఎస్పీ ఎన్ ఎస్ వి వెంకటేశ్వరరావు, సిఐ పి సురేందర్, మహిళ పోలీస్ స్టేషన్ సీఐ మల్లేష్, ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..