Telugu Updates
Logo
Natyam ad

కూకట్ పల్లి రైతుబజార్ ను ప్రారంభించిన నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: నగర ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ట్రాఫిక్ సమస్యను అధిగమించడంతో పాటు కాలనీల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. కూకట్పల్లిలో కొత్తగా రూ.15 కోట్లతో నిర్మించిన రైతుబజార్న మంత్రి మల్లారెడ్డితో కలిసి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. చుట్టు పక్కల ప్రాంతాల్లోని రైతులు, వినియోగదారులు ప్రయోజనం కోసం మార్కెట్ను నిర్మించామని మంత్రి తెలిపారు. వ్యాపారులు మార్కెట్లోకి రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి రైతు బజార్లో తిరుగుతూ రైతుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం తాజా కూరగాయాలు కొనుగోలు చేశారు..