Telugu Updates
Logo
Natyam ad

పేషంట్ ను కొరుక్కుతిన్న ఎలుకలు..!

వరంగల్ జిల్లా: వరంగల్ ఎంజీఎంలో దారుణం జరిగింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ అనే వ్యక్తి వేళ్లు, అవయవాలను ఎలుకలు కొరుక్కుతిన్నాయి. అతను ఆపస్మారక స్థితిలో ఉన్నాడు. రెండు రోజులుగా చికిత్స చేస్తున్న డాక్టర్లు కూడా ఈ విషయాన్ని గుర్తించలేకపోయారు. తీవ్ర రక్తస్రావం జరగగా గుర్తించిన బంధువులు వైద్యులకు విషయాన్ని తెలిపారు. ఇటువంటి ఘటనలు ఇక్కడ నిత్యం జరుగుతుంటాయని, ఇది సర్వసాధారణమేనని ఎంజీఎం సూపరిండెంట్ నిర్లక్ష్య సమాధానం చెప్పారు. దీంతో బాధితుని బంధువులు ఆందోళన నిర్వహించారు..వెంటనే సూపరిండెంట్ తో పాటు సంబంధిత డాక్టర్ల పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు..