Telugu Updates
Logo
Natyam ad

పాశ్చాత్య దేశాలకు తలొగ్గేదే లేదు..?

దేశద్రోహులను హెచ్చరించిన వ్లాదిమిర్ పుతిన్..

మాస్కో: ఉక్రెయిన్ విషయంలో రష్యా అనుకున్న లక్ష్యాలను సాధించి తీరుతుందని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉద్ఘాటించారు. ఈ సమయంలో పాశ్చాత్య దేశాల ఆధిపత్యాన్ని సహించమన్న ఆయన.. వారికి తలొగ్గేదే లేదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్పై దాడికి నిరసనగా రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధిస్తోన్న నేపథ్యంలో వ్లాదిమిర్ పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఉక్రెయిన్కు తటస్థ స్థితిపై చర్చించేందుకు రష్యా సిద్ధంగా ఉందన్న పుతిన్.. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఉక్రెయిన్పై సైనిక చర్య కొనసాగుతుందన్నారు. గడిచిన మూడు వారాలుగా ఉక్రెయిన్పై రష్యా చేస్తోన్న దాడులను వ్యతిరేకిస్తూ ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి టెలివిజన్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా పాశ్చాత్య దేశాలు విధిస్తోన్న ఆంక్షలు రష్యా ఆర్థిక వ్యవస్థను ఎంతగానో ఇబ్బంది తున్నాయని అంగీకరించిన ఆయన.. ఇటువంటి దెబ్బలను రష్యా తట్టుకొని నిలబడగలదనే ధీమా వ్యక్తం చేశారు..