హైదరాబాద్: ప్రియుడితో ఓ జవాన్ భార్య రాసలీలలు సాగిస్తూ అడ్డంగా దొరికిపోయిన ఘటన నగరంలోని రహమత్నగర్ లో చోటు చేసుకుంది. రహమత్నగర్ లోని యాదగిరినగర్ జవాన్ మధుసూదన్ భార్య అద్దె ఇంట్లో ఉంటోంది. ప్రియుడినే భర్తగా పరిచయం చేసిన కి’లేడీ’.. ఇల్లు అద్దెకు తీసుకుంది. అకస్మాత్తుగా ఇంటికొచ్చిన జవాన్.. ప్రియుడితో ఏకాంతంగా ఉన్న భార్యను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం వాళ్లను ఇంట్లోనే ఉంచి తాళం వేసిన మధుసూదన్.. భార్య, ఆమె ప్రియుడిపై జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. జవాన్ దంపతులకు ఇద్దరు పిల్లలున్నట్లు పోలీసులు తెలిపారు. జవాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు..