Telugu Updates
Logo
Natyam ad

రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జిని సోమవారం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని ఆయన పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అండర్ బ్రిడ్జి నిర్మాణం తుదిదశకు చేరుకుందని తెలిపారు. బ్రిడ్జి నిర్మాణంతో టూటౌన్ ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ యువ నాయకులు విజిత్ రావు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.