Telugu Updates
Logo
Natyam ad

రాహుల్ గాంధీ చేతకాని తనమే భాజపాను గెలిపిస్తోంది. బాల్క సుమన్

రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి తీరు మార్చుకోక పోతే తగిన సమాధానం ఇస్తాం: బాల్క సుమన్..

హైదరాబాద్: రెండు జాతీయ పార్టీల నేతలు తెలంగాణపై దండయాత్రకు వస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ఆరు దశాబ్దాలుగా భాజపా, కాంగ్రెస్ కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉన్నాయని విమర్శించారు. హైదరాబాద్ లో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ.. భాజపా, కాంగ్రెస్ నుంచి ప్రజలు విముక్తి కావాల్సి ఉందన్నారు. అభివృద్ధిలో చైనా, అమెరికాలను మించి భారత్ దూసుకెళ్లాలని సీఎం కేసీఆర్ అనడం వల్లే కాంగ్రెస్, భాజపా తెలంగాణపై కక్ష కట్టాయన్నారు..

“కేసీఆర్ విజన్ భాజపా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేదో రాహుల్ గాంధీ, నడ్డా సమాధానం చెప్పాలి. బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, కాళేశ్వరానికి జాతీయ హోదా, విభజన హామీలపై భాజపా వైఖరి చెప్పిన తర్వాతే జేపీ నడ్డా రాష్ట్రంలో అడుగు పెట్టాలి. రాహుల్ గాంధీ చేతకాని తనమే భాజపాను గెలిపిస్తోంది. భాజపాపై పోరాటంలో రాహుల్ ఫైటర్గా మారుతారా లేదా రాజకీయాల నుంచి రిటైర్ అవుతారో తేల్చుకోవాలి. విద్యుత్ కోతలతో రైతులు సతమతమవుతున్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై రాహుల్ దృష్టి పెట్టాలి. రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి తీరు మార్చుకోక పోతే తగిన సమాధానం ఇస్తాం” అని బాల్క సుమన్..