కొండెక్కిన అర్చకుడు..ఆత్మహత్యే శరణ్యం అంటూ..!
వరంగల్ జిల్లా: భద్రకాళిరోడ్ లో ఉన్న అయ్యప్ప గుడి అర్చకుడు నిరసనకు దిగారు. గుడి తమదేనని ఎండోమెంట్ అధికారులు కావాలనే కక్షగట్టి గుడికి తాళం వేశారని ఆరోపిస్తూ అర్చకుడు గణపతి శర్మ ఆందోళన చేపట్టారు. అధికారుల తీరును నిరసిస్తూ శుక్రవారం గుడిపక్కనే ఉన్న కొండపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించకుంటే ఆత్మహత్యే శరణ్యం అని అర్చకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.