Telugu Updates
Logo
Natyam ad

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

30 సంవత్సరాల తర్వాత కలిసిన స్నేహితులు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో గల స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1994-95లో పదో తరగతి చదువుకున్న వారందరూ జిల్లా కేంద్రంలోని వి కన్వెన్షన్ హాల్లో ఆదివారం కలుసుకున్నారు. హైదరాబాద్, బెంగుళూరు, తమిళనాడు, తదితర ప్రాంతాల్లో వివిధ హోదాల్లో స్థిరపడిన వారందరూ దాదాపు 30 సంవత్సరాల తర్వాత కలవడంతో పాఠశాల ఆవరణలో ఒక్కసారిగా సందడి నెలకొంది. ఒకరికొకరు యోగక్షేమాలు తెలుసుకున్నారు. చిన్ననాటి తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకోని మురిసిపోయారు. చదివిన బడి, పరిసరాలను చూసి భావోద్వేగానికి గురయ్యారు. నాడు గురువులు నేర్పిన క్రమశిక్షణ, చదువుతో ఈరోజు వివిధ స్థాయిల్లో ఉన్నామని తెలిపారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన నాటి గురువుల సేవలను కొనియాడారు. నాటి ఉపాధ్యాయులు విమలబాయి, చారి సార్, జయలక్ష్మి మేడం ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు ఏ. రాజు, వి. వెంకటరమణ, ఎన్. సతీష్ బాబు, టి. తిరుపతి రెడ్డి, బి. కిరణ్, బి. భారతి, కె, సుజన, ఉమా, సౌమ్య, ఇంకా వారి స్నేహితులు తదితరులు నేతృత్వం వహించారు.