Telugu Updates
Logo
Natyam ad

సేంద్రీయ పంటల విక్రయ కేంద్రం భవన నిర్మాణంకు భూమిపూజ.

మంచిర్యాల జిల్లా: కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో సేంద్రీయ పంటల విక్రయ కేంద్రం భవన నిర్మాణం పనులకు ఆదివారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, జిల్లా కలెక్టర్ భారతీ హోలికెరీ, అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, జిల్లా అటవీశాఖ అధికారి శివాని, ఎసిపి సాధన రష్మి పెరుమాళ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేంద్రీయ పంటలు పండించే రైతులను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ప్రత్యేకంగా విక్రయ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సేంద్రీయ విధానంలో రైతులు పండించిన కూరగాయలు, పళ్ళు, చిరుధాన్యాలు అమ్ముకునేందుకు ప్రత్యేకంగా విక్రయ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, తదితరులు పాల్గొన్నారు..