దిల్లీ: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కీలక ప్రకటన చేశారు. పూర్తిస్థాయిలో ప్రత్యక్ష రాజకీయాల్లో వస్తున్నానని.. త్వరలో రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. పదేళ్లుగా ప్రజల పక్షాన విధానాలు రూపొందించానని.. అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం పనిచేశానని చెప్పారు. ‘జన్ సురాజ్’ పేరిట ఆయన రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. బిహార్ నుంచి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తానని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు.
