పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన: డిసిపి
రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ను శంషాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) ఆర్. జగదీశ్వర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. శనివారం సాయంత్రం డిసిపి జగదీశ్వర్ రెడ్డి రాకతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. పోలీస్ స్టేషన్లో ఆయా కేసులకు సంబంధించిన ఫైళ్లను ఆయన పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్లో ఉన్న కేసులతో పాటు వాటికి సంబంధించిన పురోగతిని ఆయన పరిశీలిస్తున్నారు. అంతకుముందు పోలీస్ స్టేషన్లో సిబ్బందితో ఆయన శాఖా పరమైన పలు విషయాలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ఏసీపీ కుషాల్కర్, స్థానిక సీఐ నవీన్ కుమార్ తదితరులు ఉన్నారు..