Telugu Updates
Logo
Natyam ad

పోలీసులు వేధిస్తున్నారని రైతు ఆత్మహత్యాయత్నం

మంచిర్యాల జిల్లా: తనను పోలీసులు వేధిస్తున్నారని మనస్థాపం చెంది ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన నెన్నెల మండలం నందులపల్లి లో బుధవారం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం నందుల పల్లి గ్రామానికి చెందిన అంకయ్య గత కొన్ని రోజుల క్రితం నకిలీ పత్తి విత్తనాల కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి మరిన్ని నకిలీ పత్తి విత్తనాలు తీసుకురావాలని పోలీసులు ఒత్తిడి చేసినట్లు అంకయ్య ఆరోపించాడు. పోలీసుల వేధింపులు తాళలేక బుధవారం అంకయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు 108 లో బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.