చెరువులో విషప్రయోగం.. చనిపోయిన చేపలు
చెరువును పరిశీలించిన సర్పంచ్ తాండ్ర విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్సై ప్రవీణ్ కుమార్
రంగారెడ్డి జిల్లా: కేశంపేట మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ గ్రామ శివారులో ఉన్న చేపల చెరువులు గుర్తుతెలియని దుండగులు విష ప్రయోగం చేయడంతో అందులో ఉన్న చేపలు చనిపోయాయి. చనిపోయిన చేపలు నీటిపై తెలియదు తో ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామ సర్పంచ్ తాండ్ర విష్ణువర్ధన్ రెడ్డి చెరువును పరిశీలించారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేశంపేట ఎస్.ఐ ప్రవీణ్ కుమార్, సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి తో కలిసి తో చేపల చెరువు ను పరిశీలించారు. పరిసరాలను పరిశీలించి క్రిమిసంహారక మందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు..