మీ పిల్లలకు టికెట్లు రాకపోవడానికి నేనే కారణం: మోదీ
భాజపా ఎంపీలతో ప్రధాని…!
దిల్లీ: వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, అలాంటి వాటికి భారతీయ జనతా పార్టీలో ఎన్నటికీ స్థానం లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. అంతేగాక, ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ నేతల పిల్లలకు టికెట్లు ఇవ్వకపోడానికి కారణం తానేనని మోదీ ఈ సందర్భంగా చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం దిల్లీలోని అంబేడ్కర్ కేంద్రంలో జరిగింది. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో భాజపా అఖండ విజయం సాధించడంతో ప్రధాని మోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను పార్టీ నేతలు సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. వారసత్వ రాజకీయాలపై నేతలకు కీలక సూచనలు చేశారు..