Telugu Updates
Logo
Natyam ad

ప్రధాని మోడీ కీలక ప్రకటన..?

ధిల్లీ: కరోనా ప్రస్తుతం దేశంలో తగ్గినా, అది జన్మించిన చైనాలో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. ఈ తరుణంలో భారత ప్రధాని మోడీ బుధవారం కీలక ప్రసంగం చేశారు. ఇప్పటి వరకు దేశంలో 180 కోట్లకు పైగా కరోనా టీకాలు వేసినట్లు వెల్లడించారు. 12 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న బాలలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకుని వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. అర్హులైన వారందరికీ త్వరితగతిన వ్యాక్సినేషన్ను పూర్తి చేయాలని ఆదేశించారు. దేశ ప్రజలను మహమ్మారి బారి నుంచి రక్షించడానికి, ఫ్రంట్ లైన్ వర్కర్ల ప్రాణాలను కాపాడేందుకు 2020లో వ్యాక్సినేషన్ను ప్రారంభించామన్నారు. వీలైనంత మందిని కరోనా బారి నుంచి కాపాడడమే వ్యాక్సినేషన్ ముఖ్య ఉద్దేశమన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం కావడంలో శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, ప్రైవేటు రంగం వారు ఎనలేని కృషి చేశారన్నారు. వారికి ధన్యవాదాలు తెలిపారు..