Telugu Updates
Logo
Natyam ad

బాలల కోసం పీఎం కేర్స్” పథకం పై ప్రధాని కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

ఆదిలాబాద్ జిల్లా: కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన “బాలల కోసం పీఎం కేర్స్” పథకం ప్రవేశ పెట్టడం జరిగిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం ఢిల్లీ నుండి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో “బాలల కోసం పీఎం కేర్స్” పథకం ప్రయోజనాలను ప్రధాన మంత్రి విడుదల చేసారు. జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్, అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, సంక్షేమ అధికారి మిల్కా, బాలల సంరక్షణ అధికారి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. 2020 మార్చి 11 నుంచి 2022 ఫిబ్రవరి 28 మధ్య అనాథలైన బాలలు ఈ పథకం కింద లబ్ది పొందడానికి అర్హులని, అటువంటి పిల్లలకు సమగ్ర సంరక్షణ.. భద్రతతోపాటు భోజన, నివాస సౌకర్యం కల్పించడం ఈ పథకం లక్ష్యమని ప్రధాని తెలిపారు. చిన్నారుల కలలు సాకారం చేయడానికి ఈ పథకం ఎంతగానో దోహదం చేస్తుందని వివరించిన ఆయన. పథకం ద్వారా కలిగే ప్రయోజనాలను అధికారులకు తెలియచేశారు.

అనంతరం జిల్లా కలెక్టర్ సిక్త్ పట్నాయక్ బాలల కోసం పీఎం కేర్స్ పథకం పాస్ పుస్తకాలు, ఆయుష్మాన్ భారత్ – ప్రధానమంత్రి జనారోగ్య యోజన కార్డు, స్నేహపాత్ర సర్టిఫికెట్ ను పిల్లలకు అందజేశారు.