Telugu Updates
Logo
Natyam ad

మొక్కల సంరక్షణతోనే పర్యావరణ పరిరక్షణ

టి.జి.ఎఫ్.డి.సి డివిజనల్ మేనేజర్ శ్రావణి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మొక్కల పెంపకం మరియు వాటి సంరక్షణను ప్రతీ ఒక్కరూ తమ సామాజిక భాద్యత గా చేపట్టాలని, వీటి ద్వారానే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ (టి.జి.ఎఫ్.డి.సి) డివిజనల్ మేనేజర్ శ్రావణి అన్నారు. తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గురువారం మంచిర్యాల రేంజ్ లోని పెగడపల్లి సెక్షన్ అటవీ ప్రాంతం ఉన్న నీలగిరి ప్లాంటేషన్ లో వన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా ఈ నీలగిరి ప్లాంటేషన్ లోని ఉన్న ఖాళీ స్థలం లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి కుందారం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ,కాగజ్ నగర్ డివిజనల్ మేనేజర్ శ్రావణి మాట్లాడుతూ. పాఠశాల విద్యార్థులకు మొక్కలు పెంచాల్సిన ఆవశ్యకతను, పర్యావరణం గురించి వివరించారు. భవిష్యత్తులో మానవులతో పాటు ఇతర జీవరాశుల మనుగడ చెట్ల పెంపకం పైనే ఆధారపడి ఉందన్నారు. కాగితం తయారుకు కావాల్సిన ముడి కలపతో పాటు మంచి ఆక్సిజన్ నీలగిరి నుంచి లభ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమం లో డివిజనల్ మేనేజర్ శ్రావణి తో పాటు మంచిర్యాల రేంజ్  ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్, బెల్లంపల్లి రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ వి. సునీత, కుందారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు రామకృష్ణ, పి.రాజమొగిలి, ఫీల్డ్ సూపర్ వైజర్ లు శ్రీనివాస్, జె.తిరుపతి, వాచర్ లు శంకర్, లచ్చన్న సిబ్బంది షాహిద్, సాయికృష్ణ లు పాల్గొన్నారు.