Telugu Updates
Logo
Natyam ad

పోక్సో కోర్టును ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తి

మంచిర్యాల జిల్లా: ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు (పోక్సో) ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ లక్ష్మణ్ మాట్లాడుతూ జిల్లాలో పోక్సో కేసులను సత్వరం పరిష్కరించాలని సూచించారు. మంచిర్యాల పేరులో ఉన్న మంచిని పెంపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భారతీ హోలికెరీ, జిల్లా న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు..