Telugu Updates
Logo
Natyam ad

పిల్లలు కాదు.. చిచ్చర పిడుగులు

ఏకంగా ఐదు గోల్డ్ మెడల్స్.

ఫైటింగ్ లో అధరగొట్టిన జస్వంత్.

హర్ష్యం వ్యక్తం చేస్తున్న ట్రైనర్స్,తల్లిదండ్రులు.

షాద్ నగర్ అర్బన్, రూరల్:కుంగ్ ఫు పోటీల్లో రాణిస్తున్న జస్వంత్ ఎక్కడ ఏ స్థాయిలో పోటీలు నిర్వహించిన గానీ అక్కడ పోటీల్లో పాల్గొని మెడల్స్ సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు.ఈసారి ఏకంగా గోల్డ్‌ మెడల్స్‌ సాధించి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆదివారం హైదరాబాద్ నగరంలోని పఠాన్ చెర్వు షాటోకాన్ కరాటే అకాడమీ నిర్వాహకులు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మొదటి నేషనల్ లెవల్ కరాటే మరియు కుంగ్ ఫు ఛాంపియన్ షిప్ 2022 టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది.ఈ ఇవేంట్ కు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీకి చెందిన విద్యార్థులు ఫైటింగ్ లో జస్వంత్,కటాస్ పోటీలలో పాల్గొని మెడల్స్ సాధించారు. ముఖ్యంగా జస్వంత్ ఫైటింగ్ లో అద్భుతమైన ప్రతిభ కనబరచడం జరిగిందని మాస్టర్స్ బాల్ రాజ్, అహ్మద్ ఖాన్( బ్రూస్ లీ),శివరాం మీడియాకు తెలిపారు.అలాగే కటాస్ లో అమాన్ గోల్డ్ మెడల్ సాధించి మొదటి స్థానంలో నిలవడం విశేషం.వైష్ణవి, సంతోష్, కీర్తి, ప్రణీత్, వరలక్ష్మి, ఓంకార్, లాస్య, అర్జున్ మొదటి, రెండవ స్థానంలో నిలిచారు. జస్వంత్,అమాన్ కఠోర సాధన చేస్తూ తనదైన శైలిలో దూసుకెళ్తున్నాడు. చిరుపాయంలోనే అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ ముందుకు వెళుతున్న విద్యార్థుల పట్ల అటు తల్లిదండ్రులు, ఇటు మాస్టారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.