Telugu Updates
Logo
Natyam ad

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..!

మంచిర్యాల కలెక్టర్ భారతి హోళీ కేరి

మంచిర్యాల జిల్లా: జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి సూచించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని, ప్రజల సహాయార్ధం అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతుందని శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఎవరు నివాసం ఉండవద్దని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని ప్రస్తుత పరిస్థితికి ప్రజలు సహకరించాలని కోరారు. అత్యవసర పరిస్థితిలో జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, కంట్రోల్ రూమ్ నెంబర్ 08736-250500, 08736-250501, 08736-250502, 08736-250504, నెంబర్లు అన్ని వేళల అందుబాటులో ఉంటాయని తెలిపారు.