Telugu Updates
Logo
Natyam ad

పన్నులు చెల్లింపులకు అందుబాటులోకి క్యూఆర్ కోడ్.!

మంచిర్యాల జిల్లా: మంచిర్యాల మున్సిపాలిటీలో ఇంటి పన్ను, నీటి కుళాయి పన్నులు చెల్లించేందుకు క్యూఆర్ కోడ్ ను అందుబాటులోకి తెచ్చారు. మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ క్యూఆర్ కోడ్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబైల్ లో క్యూఆర్ కోడ్ స్కానర్ డౌన్ లోడ్ చేసుకొని పన్నుల చెల్లింపుతో పాటు ఆన్ లైన్ ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. మున్సిపల్ లోని సిటిజన్ సర్వీస్ సెంటర్ తో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ ప్లేస్ లో క్యూఆర్ కోడ్ స్కానర్ అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు.

ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని, సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలని కోరారు.