కోల్కతాలో సేవలు ప్రారంభించిన హైదరాబాదీ అంకుర సంస్థ
కోల్ కతా: ఇప్పుడంతా ఆన్లైన్ ఆర్డర్ల హవా నడుస్తోంది. కోరుకున్న నిమిషాల వ్యవధిలోనే కూరగాయలు, దుస్తులు, ఆటబొమ్మల వంటివన్నీ ఇంటికి వచ్చేస్తున్నాయి! ఇదే బాటలో మద్యం సరఫరాను కొత్త పుంతలు తొక్కిస్తూ హైదరాబాద్కు చెందిన అంకుర సంస్థ- ఇన్నొవెంట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ‘బూజీ’ బ్రాండ్ పేరుతో కోల్కతాలో వినూత్న సేవలను తాజాగా ప్రారంభించింది. ఆర్డరు చేసిన 10 నిమిషాల్లో లిక్కరును డెలివరీ చేయడం దీని ప్రత్యేకత. వాస్తవానికి ఇప్పటికే పలు కంపెనీలు ఆన్లైన్లో మద్యం డెలివరీ సర్వీసును అందిస్తున్నాయి. కానీ ఆర్డరు చేసిన 10 నిమిషాల్లో దాన్ని ఇంటికి చేర్చే సేవలను అందిస్తున్న తొలి కంపెనీ మాత్రం తమదేనని ఇన్నొవెంట్ టెక్నాలజీస్ ఓ ప్రకటనలో తెలిపింది. పశ్చిమ బెంగాల్ ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతులు తీసుకొని ఈ సర్వీసును ప్రారంభించినట్లు వెల్లడించింది..