మంచిర్యాల జిల్లా: చెన్నూర్ లో బిజెపి నాయకులు అందుగుల శ్రీనివాస్, నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, సుద్దపల్లి సుశీల్, సంతోష్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర లీగల్ సెల్ బృందం డీసీపీ అఖిల్ మహాజన్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు..