హైదరాబాద్: పల్లె, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రులు, మేయర్లతో పాటు ఇతర ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. కొన్ని జిల్లాల్లో అధికారుల అలసత్వం కారణంగా పల్లె ప్రగతి సరిగా అమలు కాకపోవడంపై ఇటీవల మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ పలు సూచనలు చేయనున్నారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణకు సంబంధించి సీఎం ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా వైకుంఠధామాలు, సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్వహణపై దృష్టిసారించారు.
సమీక్షలో ప్రకృతి వనాల అభివృద్ధిపై చర్చించనున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణపైన మంత్రులతో సీఎం సమాలోచనలు చేస్తున్నారు.