తెలంగాణ: పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన మహిళను పోలీసులు ఈడ్చుకెళ్తున్న ఓ వీడియో సామాజిక మాధ్య మాల్లో వైరల్ గా మారింది. తాజాగా ఈ వ్యవహారంపై బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బతుకుతెరువు కోసం గిరిజన మహిళలు పోడు చేసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. గిరిజన బిడ్డలపై మీకు ఎందుకింత కోపం కేసీఆర్ అంటూ శుక్రవారం ట్విటర్ వేదికగా నిలదీశారు.